నేనెక్కడున్నా అని అడుగుతా: బైడెన్‌

తాజా వార్తలు

Published : 17/02/2021 18:33 IST

నేనెక్కడున్నా అని అడుగుతా: బైడెన్‌

శ్వేతసౌధం బంగారు పంజరమంటున్న అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టి నాలుగు వారాలు కావస్తున్నా జో బైడెన్‌ శ్వేతసౌధం పరిసరాలకు ఇంకా అలవాటు పడనే లేదట. ఇటీవలి సీఎన్ఎన్‌ టౌన్‌హాల్‌ సమావేశం సందర్భంగా ఈ సంగతిని ఆయన హాస్యభరితంగా వివరించారు. ‘‘1600, పెన్సిల్వేనియా ఎవెన్యూలో ఉన్న శ్వేతసౌధంలో రోజూ ఉదయాన్నే లేచిన వెంటనే నా సతీమణి జిల్‌ను ‘‘మనం ఎక్కడున్నాం?’’ అని అడుగుతాను అంటూ ఆయన జోక్‌ చేశారు.

బైడెన్‌ అధ్యక్షుడయ్యే వరకు విల్మింగ్టన్‌లోని విశాలమైన స్వగృహంలో నివసిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన నివాసమున్న 80 ఎకరాల భవనం కూడా.. ఈత, వ్యాయామం వంటి పనులు చేసుకునేందుకు వీలుగా ఏకాంతంగా ఉండేదని ఆయన వెల్లడించారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందట. తనకు మెళకువ వచ్చేప్పటికే వైట్‌హౌజ్‌ సిబ్బంది వేచి ఉండటం, కోటు ధరించేందుకు కూడా వారు సహకరించటం, తనకు రక్షణగా ఓ చిన్న సైజు సైన్యమే సన్నద్ధంగా ఉండటం వంటివి  కొత్తగా అనిపిస్తున్నాయన్నారు. 

బైడెన్‌ అంతకు ముందు అనేకమార్లు శ్వేతసౌధానికి వచ్చినా.. అక్కడి కార్యాలయాలను తప్ప నివాస భవనాలకు ఎప్పుడూ దర్శించలేదట. ఐతే ఇక్కడి నివాస భవనం కొత్తగా అనిపిస్తోంది కానీ.. అధ్యక్ష కార్యాలయం, అక్కడి బాధ్యతలకు తాను చక్కగా అలవాటుపడిపోయానంటూ వెల్లడించారు. తాను మాట్లాడిన పలువురు మాజీ అధ్యక్షుల మాదిరిగానే తనకు కూడా వైట్‌హౌజ్‌ తనకు బంగారు పంజరంలాగా అనిపిస్తోందన్నారు. ఒక్కరుతప్ప, పలువురు మాజీ అధ్యక్షులతో ఫోన్‌లో మాట్లాడానన్న బైడెన్‌.. అదెవరో చెప్పడానికి నిరాకరించడం కొసమెరుపు. మరి అదెవరో మీరూ ఊహించారా!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని