భాజపా ఎంపీ ఆత్మహత్య..!

తాజా వార్తలు

Updated : 17/03/2021 11:02 IST

భాజపా ఎంపీ ఆత్మహత్య..!

దిల్లీ: భాజపా నేత, ఎంపీ రామ్‌స్వరూప్‌ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దిల్లీలోని ఆయన నివాసంలో విగతజీవిగా కన్పించారు. శర్మ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రి సమీపంలోని గోమతి ఆపార్ట్‌మెంట్‌లో శర్మ నివాసముంటున్నారు. బుధవారం ఉదయం శర్మ వ్యక్తిగత సహాయకుడు ఆయనకు ఫోన్‌ చేయగా ఎంతకీ ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన అతడు పోలీసులకు ఫోన్‌ చేశారు. ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు గది తలుపు బద్దలుకొట్టగా.. ఎంపీ ఫ్యాన్స్‌కు వేలాడుతూ కన్పించారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా శర్మ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన కరోనా టీకా కూడా వేయించుకున్నారు. 

62 ఏళ్ల శర్మ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో జన్మించారు. ఇదే లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు ఎంపీగా గెలిచారు. శర్మకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. ఎంపీ మరణంతో నేడు జరగాల్సిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రద్దు చేశారు. 

గత నెల దాద్రానగర్‌ హవేలీ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబయిలోని ఓ హోటల్‌ గదిలో ఆయన ఉరేసుకుని చనిపోయారు. గదిలో గుజరాతీలో రాసిన ఓ లేఖ కూడా లభించినట్లు పోలీసులు అప్పట్లో తెలిపారు. ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడితో సహా కొందరు తనను వేధిస్తున్నారని దేల్కర్‌ అందులో రాసినట్లు సమాచారం. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని