దొంగ కాదు..‘బాబా కా దాబా’ ఓనర్‌ క్షమాపణ
close

తాజా వార్తలు

Published : 13/06/2021 21:40 IST

దొంగ కాదు..‘బాబా కా దాబా’ ఓనర్‌ క్షమాపణ

దిల్లీ: ‘బాబా కా దాబా’.. మొదటిసారి లాక్‌డౌన్‌ విధించినప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిన పేరు. లాక్‌డౌన్‌ కారణంగా దిల్లీలో ఓ చిన్న టిఫిన్‌ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్న వృద్ధ జంట జీవితం అగమ్యగోచరంగా తయారైందంటూ ఓ  యువకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అప్పట్లో వైరల్‌గా మారింది. వందలాది మంది దిల్లీ వాసులు ఆర్థిక సాయం చేసి ఆ వృద్ధులకు అండగా నిలిచారు. అయితే అక్కడికి నెల రోజుల వ్యవధిలోనే వీడియోను పోస్టు చేసిన యువకుడు గౌరవ్‌ వాసన్‌పై  బాబా కా దాబా యజమాని కాంతా ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు అకౌంట్‌ నెంబర్లు, అకౌంట్‌తో లింకై ఉన్న ఫోన్లనెంబర్లను గౌరవ్‌ తన బంధువులు, కుటుంబ సభ్యులవి ఇచ్చి దాతలు తమకోసం ఇచ్చిన డబ్బులను కాజేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలేమీ ఆయన పోలీసులకు సమర్పించలేదు.

కాగా, తాను అప్పట్లో చేసిన ఆరోపణలు తప్పని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కాంటా ప్రసాద్‌ తాజాగా తెలిపాడు. గౌరవ్‌ వాసన్‌ దొంగకాదని, ఆయన ఎంతో మంచి వాడంటూ మరో వీడియోను రూపొందించాడు. రెండు చేతులూ జోడించి తనను క్షమించాల్సిందిగా ప్రాధేయపడ్డాడు. దీనిని ఓ ఫుడ్‌ బ్లాగర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో ప్రస్తుతం మళ్లీ వైరల్‌ అవుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా తమ బతుకులు రోడ్డున పడిపోయాయంటూ కన్నీరు పెట్టడంతో దేశవ్యాప్తంగా అప్పట్లో వీడియో చర్చనీయాంశమైంది. ‘బాబా కా దాబా’ యజమానికి పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. ఆ డబ్బుతో అదే ప్రాంతంలో ఓ రెస్టారంట్‌ను ప్రారంభించాడు. అయితే క్రమేపీ దాని నిర్వహణ చాలా భారమైంది. దీంతో కాంతా ప్రసాద్‌ మళ్లీ చిన్న టిఫిన్‌ సెంటర్‌నే నడపడం ప్రారంభించారు. దీని ద్వారా రోజుకు రూ.700 నుంచి రూ. 1000 వరకు సంపాదించగలగుతున్నానని చెబుతున్నాడు.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని