Boris Johnson vs Umbrella: బ్రిటన్‌ ప్రధాని మాట వినని గొడుగు

తాజా వార్తలు

Published : 29/07/2021 19:46 IST

Boris Johnson vs Umbrella: బ్రిటన్‌ ప్రధాని మాట వినని గొడుగు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్ ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్‌ను ఓ గొడుగు బాగా ఇబ్బంది పెట్టింది. పోలీసు మెమోరియల్ వేడుకల్లో బ్రిటన్ ప్రధాని పాల్గొనగా వాతావరణం చల్లబడి చినుకులు పడ్డాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న గొడుగును బొరిస్ తెరవగా అది వెంటనే మూసుకుపోయింది. తిరిగి తెరవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గొడుగుతో ప్రధాని పడుతున్న అవస్థలు చూసి అక్కడి అధికారులు నవ్వుకున్నారు. ఆ సమయంలో బొరిస్ పక్కనే ఉన్న ప్రిన్స్ చార్లెస్ సైతం బొరిస్ పాట్లు చూసి చిరు నవ్వులు చిందించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని