బ్రెజిల్‌లో ఒక్కరోజే 3,251 మంది మృతి

తాజా వార్తలు

Updated : 24/03/2021 12:44 IST

బ్రెజిల్‌లో ఒక్కరోజే 3,251 మంది మృతి

బ్రెసీలియా: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విలయం సృష్టిస్తోంది. బ్రెజిల్‌లో మంగళవారం ఒక్కరోజే 3,251 మంది మృత్యువాత పడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ స్థాయిలో మరణాలు ఏ దేశంలో కూడా లేవని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్క సావోపోలో నగరంలోనే 1021 మంది కరోనాతో మృతిచెందారు. దేశవ్యాప్తంగా 84 వేలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు బ్రెజిల్‌ ప్రభుత్వం వెల్లడించింది. మహమ్మారి విజృంభణతో బ్రెజిల్‌ ఆరోగ్య వ్యవస్థ సంక్షోభంలో పడింది. రోగులకు ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు అందడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు అధికంగా సంభవించిన దేశాల జాబితాలో అమెరికా తర్వాత బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు బ్రెజిల్‌లో మూడు లక్షల మంది కొవిడ్‌ కారణంగా మరణించారు. కరోనాను నియంత్రించడంలో అధ్యక్షుడు బోల్సొనారో విఫలమయ్యారని అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. లాక్‌డౌన్‌ విధించకపోవడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆరోపించాయి.

అగ్రరాజ్యం అమెరికాలోనూ రోజూవారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 56,194 మందికి కొవిడ్‌ నిర్ధరణ అయ్యింది. 838 మంది మహమ్మారికి బలయ్యారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని