Viral Video: వంట పాత్రలో నూతన వధూవరులు

తాజా వార్తలు

Updated : 18/10/2021 20:34 IST

Viral Video: వంట పాత్రలో నూతన వధూవరులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ అక్కడ జరిగిన ఓ పెళ్లి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పెళ్లికి వేదికైన ఆలయం నీట మునగడంతో.. సమీపంలోని కల్యాణ మండపానికి వంట పాత్రలో బయలుదేరాల్సిన విచిత్రమైన అనుభవం ఓ జంటకు ఎదురైంది. చెంగనూరులోని ఓ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్న ఆకాశ్‌, ఐశ్వర్య అనే జంట.. తలవాడిలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ ప్రాంతమంతా నీట మునగడంతో సమీపంలోని కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని భావించారు. అయితే అక్కడికి వెళ్లే దారిలోనూ నీరు నిలిచి ఉండటంతో పెళ్లి కోసం తెచ్చిన వంట పాత్రలో కూర్చొని వివాహ వేదికకు బయలుదేరారు. బంధువులు ఆ పాత్రను తోసి వారిని కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం ఇరువురూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భారీ వర్షాలు అడ్డంకిగా మారినా.. పెళ్లి కార్యక్రమం సజావుగా ముగియడంతో వధూవరుల బంధువులు సంతోషించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని