
తాజా వార్తలు
బ్రిటన్ రకం: భారత్లో 116కు చేరిన కేసులు
దిల్లీ: బ్రిటన్లో వెలుగుచూసిన కొత్తరకం వైరస్ కేసుల సంఖ్య భారత్లో పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు దేశంలో 116 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిని ప్రత్యేక గదుల్లో ఉంచి ఆయా రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా వీరికి సన్నిహితంగా మెలిగిన వారిని కూడా క్వారంటైన్లో ఉంచామని.. పాజిటివ్ వచ్చిన వారితో విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను, వారి కుటుంబ సభ్యుల కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చేపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. పాజిటివ్ వచ్చిన వారి జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేపడుతున్నామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే, బ్రిటన్ రకం వైరస్ దాదాపు 50దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని దేశాలు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది.
ఇక, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులోభాగంగా వైద్యులు, ఆరోగ్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు టీకా అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3006 కేంద్రాల్లో ఈ పంపిణీ కొనసాగుతోంది.
ఇవీ చదవండి..
భారత్లో టీకా పంపిణీ..ప్రపంచానికి పాఠాలు
‘పేషెంట్ జీరో’ను ఎప్పటికీ కనుక్కోలేము..!