2020లో 4-5 మినీ బడ్జెట్‌లు ప్రవేశపెట్టాం

తాజా వార్తలు

Updated : 29/01/2021 13:51 IST

2020లో 4-5 మినీ బడ్జెట్‌లు ప్రవేశపెట్టాం

పార్లమెంట్‌ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ 

దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. శుక్రవరం ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్రమంత్రులు పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఈ దశాబ్దానికి పార్లమెంట్‌ తొలి సెషన్‌ నేడు ప్రారంభం కానుంది. దేశ అత్యుత్తమ భవిష్యత్తుకు ఈ దశాబ్దం ఎంతో ప్రాముఖ్యం. మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసేందుకు బంగారం లాంటి అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ఈ అంశాలపైనే ఈ సారి సమావేశాలు సాగాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే అంశాలపైనే చర్చలు జరగాలి. ఇందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నా. ఇది బడ్జెట్‌ సెషన్‌. దేశ చరిత్రలో తొలిసారి గతేడాది ఆర్థిక మంత్రి పలు ప్యాకేజీల రూపంలో 4-5 మినీ బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్‌ ఆ మినీ బడ్జెట్లలో ఒక భాగంలా ఉండనుంది’ అని చెప్పుకొచ్చారు. 

రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. కాగా.. సాగు చట్టాలపై రైతుల ఉద్యమం నేపథ్యంలో తొలి రోజు సమావేశాల్లో గందరగోళం తలెత్తే అవకాశాలున్నాయి. ఈ అంశంపై తొలి రోజే నిరసన చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్నట్లు 18 పార్టీలు నిర్ణయించాయి. 

ఇవీ చదవండి..

అనగనగా ఒక ఆర్థిక సింహం

బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రాయితీలు..!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని