
తాజా వార్తలు
29 నుంచి బడ్జెట్ సమావేశాలు
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ - 2021-22ని ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం గురువారం ప్రకటన జారీచేసింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 8 వరకు (20 రోజుల పాటు) విరామం తర్వాత మళ్లీ ప్రారంభం కానున్న ఈ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8తో ముగిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ సమావేశాలు ప్రారంభం రోజున ఉదయం 11గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం అనంతరం ఎకనమిక్ సర్వేను విడుదల చేయనున్నారు.
సెప్టెంబర్‌లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తర్వాత మళ్లీ ఉభయ సభలు భేటీ కావడం ఇదే తొలిసారి. అప్పుడు ఏడు రోజుల పాటు మాత్రమే సమావేశాలు జరిగాయి. పలువురు ఎంపీలకు కరోనా వైరస్ సోకవడంతో ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో నవంబర్ - డిసెంబర్లో జరగాల్సిన శీతాకాల సమావేశాలు కూడా నిర్వహించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
- మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
