Rafale: బుగాట్టి Vs రఫేల్‌.. ఆసక్తికర పోరు..!

తాజా వార్తలు

Updated : 23/05/2021 11:19 IST

Rafale: బుగాట్టి Vs రఫేల్‌.. ఆసక్తికర పోరు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకటి ప్రపంచంలోనే అత్యుత్తమ సూపర్‌ కారు.. మరొకటి 4.5 జనరేషన్‌ సూపర్‌ ఫైటర్‌ జెట్‌.. రెండూ వేగంలో పోటీ పడ్డాయి. బుగాట్టి చిరాన్‌ పౌర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ కారు.. రఫేల్‌ నేవీ వెర్షన్‌ ఫైటర్‌ మధ్య ఈ డ్రాగ్‌  రేసు ఫ్రాన్స్‌లో జరిగింది. ఆ వీడియో, ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఈ రేసులో పాల్గొన్న బుగాట్టి చిరాన్‌ పౌర్‌ అత్యంత వేగవంతమైన హైపర్‌ కారు. దీనిలో 8.0లీటర్‌ డబ్ల్యూ16 ఇంజిన్‌ ఉంది. ఇది 1500 హర్స్‌పవర్‌ శక్తిని విడుదల చేస్తుంది. ఇది అత్యధికంగా గంటకు 490 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. మరోవైపు డసొ రఫేల్‌ దాదాపు 58,550 న్యూటన్ల థ్రస్ట్‌ను విడుదల చేయగలదు. ఇది దాదాపు 5,727 హర్స్‌పవర్‌ శక్తికి సమానం. రఫేల్‌ 1.8మ్యాక్‌ స్పీడ్‌తో ప్రయాణించగలదు.  అంటే గంటకు 1,912 కిలోమీటర్లు. వాస్తవానికి ఈ రెండిటి వేగం, శక్తి మధ్య ఎటువంటి పోలికా లేదు. కానీ చిరాన్‌ శక్తిని ప్రదర్శించడానికి ఇంతకంటే మంచి వేదిక లేదు.

అరనిమిషంలో 400 కిలోమీటర్ల వేగానికి..

ఈ రేసు మొదట్లో చిరాన్‌ ముందుంది. 2.4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకొంది. ఇక 6.1సెకన్లలో 200 కిలోమీటర్ల వేగాన్ని దాటేసింది. 13 సెకన్లలో 300 కిలోమీటర్ల వేగాన్నిఅందిపుచ్చుకొంది. అరనిమిషంలో గంటకు 400 కిలోమీటర్ల వేగం మార్కును చేరింది.  కాకపోతే చిరాన్‌ 450 మీటర్లు దాటేలోపే రఫేల్‌ దానిని వెనక్కి నెట్టేసింది. ఈ రేసులో బుగాట్టి కారును పియార్రి హెన్రి రాఫ్నల్‌ అనే డ్రైవర్‌ నడిపించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని