కొవిడ్‌పై  టామీ 97శాతం కరెక్ట్‌..!

తాజా వార్తలు

Published : 20/05/2021 18:44 IST

కొవిడ్‌పై  టామీ 97శాతం కరెక్ట్‌..!

 కుక్కలతో కొవిడ్‌ టెస్ట్‌ ఫలితం 

ఇంటర్నెట్‌డెస్క్‌: శునకాలు కొవిడ్‌ రోగులకు గుర్తించగలవా.. అంటే శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు.  వారు తాజాగా చేసిన పరీక్షల్లో శిక్షణ పొందిన శునకాలు  97శాతం కచ్చితత్వంతో వైరస్‌ను గుర్తించినట్లు తేలింది. ఈ పరిశోధనలను ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు నిర్వహించారు. అంతేకాదు.. నెగిటీవ్‌ పేషెంట్లను గుర్తించడంలో 91శాతం కచ్చితత్వంతో పనిచేశాయి. ప్రస్తుత ఫలితాలు ఇచ్చే చాలా యాంటీజెన్‌ పరీక్షల కంటే ఇవి ఎక్కువ కచ్చితత్వంతో ఇస్తున్నట్లు శాస్త్రవ్తేత్తలు వెల్లడించారు. దీంతోపాటు కొన్ని సెకన్లలో ఫలితాలు వచ్చేస్తాయంటున్నారు. 

అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో వీటిని ఉపయోగించి కొవిడ్‌ పేషెంట్లను గుర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలను గుర్తించడానికి వీటిని వినయోగిస్తున్నారు. 

ఈ పరీక్షలను ఫ్రాన్స్‌లోని పారిస్‌ శివార్లలోని మైసన్స్‌ అల్‌ఫోర్టలోని  నేషనల్‌ వెటర్నరి స్కూల్‌లో నిర్వహించారు.  ఈ పరీక్షలకు వినియోగించిన కుక్కలను వాలంటీర్లతో కలవకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. మొత్తం 335 మంది వాలెంటర్లు దీనిలో పాల్గొన్నారు. వారిలో 109 మందికి పీసీఆర్‌ పరీక్షలో పాజిటీవ్‌ వచ్చింది.  వాలంటీర్ల నుంచి స్వేద నమూనాలను సేకరించి వాటిని గ్లాస్‌ జార్లలో ఉంచి పరీక్షించారు.  వీటిల్లో ఏ గ్లాస్‌జార్లలో పాజిటీవ్‌ నమూనాలు ఉన్నాయో శాస్త్రవేత్తలకు కూడా తెలియనీయలేదు. వీటిని కుక్కలు చాలా కచ్చితత్వంతో గుర్తించాయి. 

గతేడాది జర్మనీలో కూడా..

గతేడాది జులైలో జర్మనీలో కూడా శిక్షణ పొందిన కుక్కలు లాలాజలం శాంపిల్స్‌ను పరిశీలించి 90శాతం కచ్చితత్వంతో కొవిడ్‌ను గుర్తించాయి. దీంతో ఫిన్లాండ్‌, స్విట్జర్లాండ్‌, దుబాయ్‌లు కుక్కలకు శిక్షణ ఇస్తున్నాయి. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని