close

తాజా వార్తలు

Updated : 21/04/2021 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Double Mutantపై Covaxin భేష్‌!

 ఐసీఎంఆర్‌ వెల్లడి

ఇంటర్నెటెడెస్క్‌: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తోందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) నేడు ప్రకటించింది. సార్స్‌కోవ్‌-2, దానిలో కొత్తగా వచ్చిన మ్యూటెంట్‌  రకాన్ని కూడా అడ్డుకుంటోందని పేర్కొంది. విజయవంతంగా యూకే, బ్రెజిల్‌,దక్షిణాఫ్రికా రకం వైరస్‌లను బంధించి కల్చర్‌ చేసినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. యూకే,బ్రెజిల్‌ వేరియంట్లను కొవాగ్జిన్‌ బలంగా నిలువరించినట్లు పేర్కొంది. దీంతోపాటు ఇటీవలే భారత్‌లో కనిపిస్తున్న డబుల్‌ మ్యూటెంట్‌ ‌ రకాన్ని కూడా  బంధించి పరీక్షలు నిర్వహించింది. దీనిపై కూడా కొవాగ్జిన్‌ బలంగా పనిచేస్తోందని ఐసీఎంఆర్‌ ట్విటర్‌లో పేర్కొంది.

టీకా తీసుకొంటే భయంలేదు: డాక్టర్‌ కృష్ణ ఎల్లా

కొవిడ్‌ టీకా  తీసుకొన్నా ఇన్ఫెక్షన్లు వస్తే భయపడాల్సిన పనిలేదని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా వెల్లడించారు. ఇంజెక్షన్‌ రూపంలో తీసుకొనే కొవిడ్‌ టీకా ఊపిరితిత్తుల కింద భాగాన్నే వైరస్‌ నుంచి రక్షిస్తుందని పై భాగాన్ని కాదని వివరించారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకొన్న తర్వత కూడా వైరస్‌ శరీరంలోకి  ప్రవేశించినా..  ప్రాణాంతకంగా మారకుండా ఉంటుందని ఆయన వివరించారని వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. టీకా తీసుకొన్నా మాస్క్‌ ధరించడం తప్పని సరి అని ఆయన వివరించారు. 

కొవిడ్‌-19 కేసుల తీవ్రత పెరగడం, టీకాకు తీవ్రమైన కొరత ఏర్పడటంతో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ‘కొవాగ్జిన్‌’ టీకా తయారీని గణనీయంగా పెంచాలని ప్రతిపాదించింది. ఏడాదికి 70 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ టీకా తయారీ   సామర్థ్యం జులై-ఆగస్టుకు సమకూరుతుందని  భారత్‌ బయోటెక్‌ మంగళవారం  వెల్లడించింది. హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లోని భారత్‌ బయోటెక్‌ యూనిట్లలో దశల వారీగా టీకా ఉత్పత్తి పెంచుతారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని