కెనడాలో ఆస్ట్రాజెనికా టీకాపై ఆంక్షలు

తాజా వార్తలు

Published : 31/03/2021 01:08 IST

కెనడాలో ఆస్ట్రాజెనికా టీకాపై ఆంక్షలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడాలో ఆస్ట్రాజెనికా టీకాపై ఆంక్షలు విధించారు. పెద్దల్లో 55 ఏళ్ల లోపువారికి ఈ టీకాను వినియోగించవద్దని పేర్కొంది. ఈ మేరకు కెనడా నేషనల్‌ కమిటీ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌(ఎన్‌ఏసీఐ) పేర్కొంది. అత్యంత అరుదుగా రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న సమాచారంపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. టీకాలు తీసుకొన్న సమయంలో వీఐపీఐటీ అనే లక్షణాలు ఐరోపాలో కనిపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకొంది. 

‘‘ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కెనడా ఆరోగ్య విభాగం డేటాను విశ్లేషిస్తుంది. అందులో భాగంగానే ఎన్‌ఏసీఐ టీకాను 55 ఏళ్లలోపు వారికి ఇవ్వకూడదని పేర్కొంది. ఇప్పటికే డజనుకుపైగా ఐరోపా దేశాలు ఈ టీకా తీసుకోవడంపై ఆంక్షలు విధించిన తర్వాత కెనడా ఈ చర్యను తీసుకొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని