రంగురంగుల కాలీఫ్లవర్లతో కాసుల పంట

తాజా వార్తలు

Published : 15/02/2021 23:47 IST

రంగురంగుల కాలీఫ్లవర్లతో కాసుల పంట

పట్నా: కాలీఫ్లవర్‌ను తెలుపురంగులో తప్ప మరో రంగులో ఊహించుకోలేం.! మరి మార్కెట్‌కి వెళ్లినప్పుడు తెలుపు రంగుకి బదులు రంగురంగుల కాలీఫ్లవర్లు దర్శనమిస్తే ఆశ్చర్య పోకుండా ఉండలేం కదా.!  ఆ పంటను చూడాలంటే బిహార్‌లోని పూర్ణియా జిల్లాకు వెళ్లాల్సిందే. పూర్ణియా జిల్లా చంఢీ పరిధిలోని లోహియానగర్‌ గ్రామానికి చెందిన రైతు శశిభూషణ్‌ సింగ్‌.. ఆకర్షణీయమైన నీలం, పసుపు, ఎరుపు రంగు కాలీఫ్లవర్‌లను పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. పొలంలోనే ఒక్కో కాలీఫ్లవర్‌ని రూ.30వరకు విక్రయిస్తున్నారు. ‘‘ఒక ప్రయోగంలో భాగంగా కేవలం వెయ్యి కాలీఫ్లవర్‌లను మాత్రమే ఉత్పత్తి చేశాను. వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాబోయే సీజన్‌లో ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నా. మార్కెట్‌లో వీటికి డిమాండ్‌ అధికంగా ఉంది. ఒక్కో కాలీఫ్లవర్‌కి రూ.30 వరకు లాభం వస్తోంది’’ అని శశిభూషణ్‌ పేర్కొన్నారు. 
ఇవీ చదవండి..

అంతరిక్షంలోకి మోదీ ఫొటో..! 

నేపాల్‌, శ్రీలంకలోనూ భాజపా విస్తరణ!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని