Kerala: అందుకే కేరళలో కేసులు పెరుగుతున్నాయ్‌..!

తాజా వార్తలు

Published : 04/08/2021 23:47 IST

Kerala: అందుకే కేరళలో కేసులు పెరుగుతున్నాయ్‌..!

నివేదిక సమర్పించిన కేంద్ర బృందం

దిల్లీ: కొవిడ్ రోగులను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకపోవడం వల్లే కేరళలో భారీస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ పరిస్థితుల్ని సమీక్షించేందుకు అక్కడికి వెళ్లిన కేంద్ర బృందం ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి వెల్లడించింది. 

కరోనా రెండోవేవ్‌ తగ్గుముఖం పడుతుందనుకునే సమయంలో కేరళలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అక్కడ గత కొద్ది రోజులుగా 20 వేల మందికి పైగానే వైరస్ బారినపడుతున్నారు. దాంతో కేరళ పరిస్థితిని పర్యవేక్షించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌కు చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్రం అక్కడకు పంపింది. ఈ క్రమంలో కేరళ విధానాల్లోని లోపాలను బృంద సభ్యులు ఆరోగ్య శాఖకు నివేదించారు. 

కరోనా బాధితుల్లో 90 శాతం మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఆ బృందం పేర్కొంది. హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలను సరిగా పాటించడం లేదని, సంస్థాగత క్వారంటైన్‌ పాటించాల్సి ఉందని వెల్లడించింది. అలాగే వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్ని గుర్తించే విధానం సరిగా లేదని తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటులో అలసత్వం కనిపిస్తోందని వెల్లడించింది. కాగా ఈ నివేదికపై  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ‘కేరళ నుంచి వచ్చిన కేంద్ర బృందం నివేదికను సమర్పించింది. కేసులు పెరుగుతున్న విషయంపై నేను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో చర్చించాను’ అంటూ మాండవీయ వెల్లడించారు.  

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని