ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై కేంద్రం మరో ప్రకటన 
close

తాజా వార్తలు

Published : 16/03/2021 20:28 IST

ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై కేంద్రం మరో ప్రకటన 

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ప్రైవేటీకరణ అంశంపై తెలంగాణ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి  అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ లోక్‌సభలో సమాధానమిచ్చారు. రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదన ఉన్నట్టు వెల్లడించారు. పెట్టుబడులు ఉపసంహరణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనే ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఒక విధాన ప్రకటన చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ఖరారు చేసి విడుదల చేస్తుందన్నారు.  

మరోవైపు, వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని చెబుతోన్న కేంద్రం.. ఖాయిలా పడిన పరిశ్రమలు, నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రైవేటు రంగానికి విక్రయించడం ద్వారా సమకూరే వనరులను సంక్షేమ, అభివృద్ధికి వినియోగించడమే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం.. విశాఖ ఉక్కు పరిశ్రమను సైతం ప్రైవేటీకరిస్తామని ప్రకటించడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమతున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని