చమురు ఆదాయం.. ఆరేళ్లలో 300% జంప్‌

తాజా వార్తలు

Published : 22/03/2021 18:39 IST

చమురు ఆదాయం.. ఆరేళ్లలో 300% జంప్‌

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయం గడిచిన ఆరేళ్లలో 300 శాతం పెరిగిందని ప్రభుత్వం లోక్‌సభకు వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంట్‌ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది (2014-15) పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం ద్వారా ₹29,279 కోట్లు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం ద్వారా ₹42,881 కోట్లు సమకూరిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి 10 నెలల్లో పెట్రోల్‌, డీజిల్‌పై ₹2.94 లక్షల కోట్లు వచ్చినట్లు తెలిపారు.

2014లో పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం ₹9.48గా ఉండగా.. ప్రస్తుతం ₹32.90కి చేరిందని ఠాకూర్‌ తెలిపారు. డీజిల్‌పై ₹3.56గా ఉండగా అది ₹31.80 శాతానికి పెరిగిందని చెప్పారు. ప్రభుత్వానికి వస్తున్న మొత్తం ఆదాయంలో పెట్రోల్‌, డీజిల్‌, సహజవాయువుపై వస్తున్న ఆదాయం వాటా 2014-15లో 5.4 శాతం ఉండగా.. ప్రస్తుతం 12.2 శాతానికి చేరిందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ లెక్కన పెట్రోల్‌ ధరలో 60 శాతం, డీజిల్‌ ధరలో 53 శాతం పన్నుల వాటానే ఉంటోంది. పన్నుల ద్వారా సమకూరిన ఆదాయాన్ని మౌలిక సదుపాయాల కల్పనకు, ఇతర అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నట్లు అనురాగ్‌ ఠాకూర్‌ ఈ సందర్భంగా తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని