రూ.1.23 లక్షల కోట్లు విలువైన ధాన్యం సేకరణ
close

తాజా వార్తలు

Updated : 21/02/2021 15:55 IST

రూ.1.23 లక్షల కోట్లు విలువైన ధాన్యం సేకరణ

దిల్లీ: ఈ ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో కేంద్రం 651.07 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని సేకరించింది. దీని విలువ దాదాపు రూ.1.23 లక్షల కోట్లు ఉంటుందని కేంద్ర ఆహార శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా 93.93 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు పేర్కొంది. ఓవైపు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపడుతుండగా.. ఈ ధాన్యానంతా కనీస మద్దతు ధరకే(ఎంఎస్‌పీ) కొనుగోలు చేయడం గమనార్హం. రాబోయే సీజన్లోనూ ఎంఎస్‌పీకే ధాన్యాన్ని సేకరిస్తామని కేంద్ర ఈ సందర్భంగా హామీ ఇచ్చింది. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌తో పోలిస్తే ఈసారి 15.91 శాతం అధికంగా ధాన్యం సేకరించినట్లు పేర్కొంది. మరోవైపు 651.07 లక్షల మెట్రిక్‌ టన్నుల్లో 202.82 లక్షల మెట్రిక్‌ టన్నులు అంటే 31.15 శాతం ధాన్యం ఒక్క పంజాబ్‌ నుంచే వచ్చినట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని