B.1.617: WHO అలా చెప్పలేదు
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 13:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

B.1.617: WHO అలా చెప్పలేదు

దిల్లీ: బి.1.617.. భారత్‌ రకం స్ట్రెయిన్‌ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎక్కడా చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియా సంస్థలే అలా వాడుతున్నాయని పేర్కొంది. భారత రకం కరోనా వైరస్‌ ప్రపంచానికి ఆందోళనకరమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం తీవ్రంగా స్పందించింది.

‘‘బి.1.617 వైరస్‌ స్ట్రెయిన్‌ ఆందోళనకర రకంగా డబ్ల్యూహెచ్‌ఓ వర్గీకరించినట్లు చాలా మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాల్లో బి.1.617ను ‘భారత వేరియంట్‌’ అని పేర్కొన్నారు. ఆ వార్తలు నిరాధారం, అవాస్తవం. బి.1.617ను భారత రకం స్ట్రెయిన్‌ అని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పలేదు.  కరోనా వైరస్‌ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో 32 పేజీల నివేదిక ఇచ్చింది. అందులో ఎక్కడా ‘భారత్‌’ అనే పదం లేదు’’అని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. 

బి.1.6.17 స్ట్రెయిన్‌ ఆందోళనకర రకంగా పేర్కొన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ కొవిడ్‌ విభాగ సాంకేతిక నిపుణురాలు డా. మరియా వాన్‌ కేర్‌ఖోవ్‌ గత సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్‌లో వెలుగుచూసిన ఈ వైరస్‌ వ్యాప్తి తీవ్రత గురించి తమకు అవగాహన ఉందని, దీనిపై అధ్యయనాలను పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ స్ట్రెయిన్‌ వ్యాప్తి తీవ్రంగా ఉందని, ఇది ప్రపంచానికి ఆందోళనకరమని గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే ఇదంతా ప్రాథమిక సమాచారం మాత్రమేనని, దీనిపై లోతుగా అధ్యయనం చేయాల్సినం అవసరం ఉందని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని