కరోనాను జయించిన 116 ఏళ్ల బామ్మ 
close

తాజా వార్తలు

Updated : 11/02/2021 14:02 IST

కరోనాను జయించిన 116 ఏళ్ల బామ్మ 

పారిస్‌: ప్రపంచంలోకెల్లా రెండో అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న 116 ఏళ్ల సన్యాసిని సిస్టర్‌ ఆండ్రే కరోనాను జయించారు. దక్షిణ ఫ్రెంచ్‌ నగరమైన టౌలాన్‌లోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆమెకు గత నెల్లో కరోనా సోకింది. మూడు వారాల చికిత్స అనంతరం.. తాజాగా కొవిడ్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. గురువారం ఆమె 117వ పడిలోకి అడుగు పెట్టనుండటం విశేషం. దివ్యాంగురాలైన సిస్టర్‌ ఆండ్రే ప్రస్తుతం చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. కరోనా పాజిటివ్‌గా తేలినప్పుడు తాను ఎలాంటి ఆందోళనకు గురికాలేదని చెప్పారామె. 

ఇవీ చదవండి..

97.27 శాతానికి పెరిగిన రికవరీ రేటు

కరోనా మొదటి రోజులు అత్యంత కీలకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని