Lockdown: గుర్రాలపై గస్తీ

తాజా వార్తలు

Updated : 11/07/2021 16:24 IST

Lockdown: గుర్రాలపై గస్తీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ రెండో రోజు పకడ్బందీగా సాగుతోంది. పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాట్లు చేసి వాహనదారులను కట్టడి చేస్తున్నారు. ఈ తరుణంలో చైతన్యపురిలో పోలీసులు వినూత్నంగా గుర్రాలపై తిరగుతూ లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురిలో పోలీసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల తర్వాత ఎవరనీ బయటకు రాకుండా గస్తీ కాస్తున్నారు. నిర్లక్ష్యంగా బయట తిరిగేవాళ్లకు లాక్‌డౌన్‌ నింధనలపై అవగాహన కల్పిస్తున్నారు. 

ఈ సందర్భంగా చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ మాట్లాడుతూ ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు చక్కగా పాటిస్తున్నారని తెలిపారు. వర్తకులు స్వచ్ఛందంగా 10 గంటలకే షాపులన్నీ మూసి ఇంటికే పరిమితిమవుతున్నారని అన్నారు. గుర్రాలపై తిరుగుతూ గస్తీ కాస్తున్నామని చెప్పారు. లాక్‌డౌన్‌ పాటించని వాళ్ల మీద  కేసులు బుక్ చేస్తున్నామని, మాస్క్ పెట్టుకోకపోయినా, సామాజిక దూరం పాటించకపోయినా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. అనవసరంగా ప్రజలెవరూ రోడ్ల మీదకు రావద్దని, ఇళ్లలోనే ఉంటూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించిమని కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని