వ్యక్తిగత సమాచార సేకరణలో చైనా యాప్‌లు
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 15:59 IST

వ్యక్తిగత సమాచార సేకరణలో చైనా యాప్‌లు

బీజింగ్‌: వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తున్న తమ దేశంలోని 129 మొబైల్‌ యాప్‌ల నిర్వాహకులకు చైనా సైబర్‌స్పేస్‌ నిఘా సంస్థ తాఖీదులు జారీ చేసింది. వాటిలో వార్తలను అందించే యాప్‌లతో పాటు ఫిట్‌నెస్, ఆన్‌లైన్‌ షాపింగ్, విద్య, మహిళల ఆరోగ్యం, వీడియో స్ట్రీమింగ్‌కు సంబంధించినవి కూడా ఉన్నాయి. టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌ అభివృద్ధిచేసిన జిన్రి టౌతియావో, టెన్సెంట్‌ నిర్వహణలోని క్వయ్‌ బావో, టెన్సెంట్‌ న్యూస్‌ వంటి యాప్‌లు వాటిలో ఉన్నాయని హాంకాంగ్‌ నుంచి ప్రచురితమయ్యే సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక పేర్కొంది. సేవలతో సంబంధంలేని సమాచారాన్ని కూడా యాప్‌ నిర్వాహకులు సేకరిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో సైబర్‌స్పేస్‌ నిఘా సంస్థ రంగంలోకి దిగి దర్యాప్తు జరిపింది. 15రోజుల లోగా అక్రమ విధానాలను సరిచేసుకోవాలని హెచ్చరించినట్లు ఆ పత్రిక వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని