అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా వివాదాస్పద వ్యాఖ్యలు

తాజా వార్తలు

Updated : 08/09/2020 01:21 IST

అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా వివాదాస్పద వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌తో సరిహద్దుల్లో పట్టు కోసం విఫల యత్నం చేస్తున్న చైనా మరోసారి అరుణాచల్‌ప్రదేశ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌గా భారత్‌ పిలిచే ప్రాంతాన్ని చైనా ఎన్నడూ గుర్తించలేదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజాన్ వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతం చైనాలోని దక్షిణ టిబెట్‌లో భాగమన్నారు. మరోవైపు ఆ ప్రాంతంలో అదృశ్యమైన ఐదుగురు భారతీయుల సమాచారం ప్రస్తుతం తమ వద్ద లేదన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని భారత్‌-చైనా సరిహద్దు అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన ఐదుగురు అరుణాచల్‌ప్రదేశ్ వాసుల్ని చైనా సైన్యం అపహరించిందని స్థానిక పోలీసులు ఆరోపించారు. వీరి సమాచారం కోసం భారత సైన్యం చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి సందేశం పంపించింది. ఈ నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ ఇలా బదులిచ్చింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని