China: చైనాలో 100 కోట్ల మందికి రెండు డోసుల టీకాలు

తాజా వార్తలు

Published : 16/09/2021 23:50 IST

China: చైనాలో 100 కోట్ల మందికి రెండు డోసుల టీకాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలో 100 కోట్ల మందికి పూర్తిగా వ్యాక్సిన్లు వేశారు. ఈ సంఖ్య ఆ దేశజనాభాలో 71శాతానికి సమానం.  ఇప్పటికే వైరస్‌ను చైనా చాలా వరకు అదుపు చేసినట్లు చెబుతోంది. అయినా కానీ వ్యాక్సినేషన్‌ ఏమాత్రం తగ్గించలేదు. తాజాగా కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. 

చైనా ఎన్‌హెచ్‌సీ ప్రతినిధి మీ ఫెంగ్‌ బీజింగ్‌లో మాట్లాడుతూ  మొత్తం 2.16 బిలియన్ల డోసులను వేశామని వెల్లడించారు. చైనా వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామం గతేడాది మొదలైంది. తొలి సారి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకాలు ఇచ్చారు. దీనిలో సైనాఫార్మ్‌కు చెందిన టీకాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కనీసం మరో ఆరు కంపెనీలు టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం చైనాలో 12 ఏళ్లు నిండిన వారికి కూడా టీకాలు వేస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా కొవిడ్‌ టీకాలు వేస్తున్న దేశాల్లో చైనా ముందుంది. అమెరికా, జపాన్‌లలో ఇప్పటికే సగం మందికిపైగా టీకాలు వేశారు. ఇక బ్రిటన్‌, జర్మనీల్లో 60శాతం మందికి టీకాలు అందాయి. భారత్‌లో మాత్రం 15శాతం మందికి మాత్రమే ఇప్పటి వరకు పూర్తిస్థాయి టీకాలు అందాయి’’ అని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాక్సిన్‌ ట్రాకర్‌సమాచారం వెల్లడిస్తోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని