close

తాజా వార్తలు

Published : 14/01/2021 11:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

8నెలల్లో..చైనాలో తొలి కరోనా మరణం!

బీజింగ్‌: ప్రపంచదేశాలను సంక్షోభంలోకి నెట్టిక కరోనా వైరస్‌కు జన్మస్థానమైన చైనాలో మరోసారి వ్యాధి‌ తీవ్రత పెరిగింది. దీంతో ఇప్పటికే పలు నగరాల్లో లాక్‌డౌన్‌లు, ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల్లో ఇక్కడ తొలి కరోనా మరణం నమోదయ్యింది.

కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు చైనా గట్టి చర్యలే చేపడుతోంది. ఇందుకోసం లాక్‌డౌన్‌ ఆంక్షలతో పాటు భారీ స్థాయిలో కొవిడ్‌ టెస్టులను నిర్వహిస్తోంది. అయితే, తాజాగా నేడు ఒక్కరోజే 138కేసులు నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. 2020 మార్చి తర్వాత ఇన్ని కేసులు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి. తాజాగా కొవిడ్‌ సోకిన వారిలో ఒకరు మరణించినట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది. అయితే మృతికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఇప్పటికే లాక్‌డౌన్‌ అమలులో ఉన్న హెబి ప్రావిన్సులో తాజాగా కొవిడ్‌ మరణం చోటుచేసుకున్నట్లు మాత్రమే ప్రకటించింది.

కొవిడ్‌-19 పుట్టిల్లైన చైనాలో గత కొన్ని రోజులుగా వైరస్‌ తీవ్రత పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా హెబీ ప్రావిన్సుతో పాటు షిజియాజువాంగ్‌ ప్రావిన్సుల్లో వైరస్‌ విస్తృతి పెరిగింది. దీంతో ఆ రెండు ప్రావిన్సుల్లో అధిక జనాభా నివశించే జింగ్‌టాయ్‌, లాంగ్‌ఫాంగ్‌ వంటి నగరాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఇక, చైనాలో ఇప్పటివరకు 4635 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. గత మే నెల నుంచి ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదుకాలేదు.

వుహాన్‌ చేరుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం..
కరోనా వైరస్‌ మూలాలను పరిశోధించడంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల బృందం వుహాన్‌ నగరానికి చేరుకుంది. పది మంది నిపుణులతో కూడా ఈ బృందానికి పీటర్‌ బెన్‌ ఎంబారెక్‌ నేతృత్వం వహిస్తున్నారు. అయితే, అక్కడ వైరస్‌ తీవ్రత మళ్లీ పెరగడంతో ఈ బృందం రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నట్లు దర్యాప్తు బృందం వెల్లడించింది. అనంతరం వుహాన్‌ నగరంలో వెలుగుచూసిన వైరస్‌ మూలాలపై పరిశోధన ప్రారంభిస్తామని తెలిపింది. ఇదిలాఉంటే, 
కరోనా వైరస్‌ బయటపడి సంవత్సరం గడిచిన తర్వాత వైరస్‌ మూలాలపై దర్యాప్తు జరపడం, ఈ సమయంలోనే చైనాలో మళ్లీ వైరస్‌ విజృంభిస్తుండడంపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇవీ చదవండి..
చైనా నగరాల్లో ఎమర్జెన్సీ
కొవిడ్‌ మూలాలు: ఏడాదైనా మిస్టరీగానే..!


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన