China: స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం.. 3 నెలలు అంతరిక్షంలోనే..
close

తాజా వార్తలు

Published : 16/06/2021 23:08 IST

China: స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం.. 3 నెలలు అంతరిక్షంలోనే..

రేపు నింగిలోకి వెళ్లనున్న ముగ్గురు వ్యోమగాములు

జీజింగ్‌: చైనా తాను నిర్మించనున్న నూతన స్పేస్‌ స్టేషన్  కోసం ముగ్గురు వ్యోమగాములను గురువారం అంతరిక్షంలోకి పంపనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. షెంజౌ-12 వ్యోమనౌక ద్వారా ముగ్గురు వ్యోమగాములను నింగిలోకి పంపనుండగా.. వారు చైనా సొంత స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం వారు మూడు నెలలు అంతరిక్షంలోనే గడపనున్నారు. వచ్చే నెలలో చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) వందేళ్ల సంబరాలు జరుపుకోనున్న వేళ చైనా ఈ మిషన్‌ను చేపట్టింది. 

స్పేస్‌ స్టేషన్ కోర్ మాడ్యూల్ తియాన్హేను ఏప్రిల్ 29వ తేదీనే చైనా నింగిలోకి పంపింది. ముగ్గురిని తీసుకుని షెంజౌ వ్యోమనౌక కక్ష్యలోకి చేరగానే.. కోర్ మాడ్యూల్ తియాన్హేతో అనుసంధానమవుతుంది. అనంతరం కార్గో క్రాఫ్ట్  తియంజౌ-2తో కూడా అనుసంధానం ఏర్పాటుచేసుకోనుంది. కోర్ మాడ్యూల్‌లోనే మూడు నెలలు చైనా వ్యోమగాములు ఉండి స్పేస్‌ స్టేషన్‌ను నిర్మిస్తారు. మరిన్ని పరిశోధనల ద్వారా రెండేళ్లలో సొంత స్పేస్‌స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని  చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్లే వ్యోమనౌకను లాంగ్‌మార్చ్-2ఎఫ్‌ రాకెట్ ద్వారా గురువారం ప్రయోగించనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని