China: అణు సామర్థ్యమున్న హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష

తాజా వార్తలు

Published : 17/10/2021 19:20 IST

China: అణు సామర్థ్యమున్న హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష

ఇంటర్నెట్‌డెస్క్‌: అణు సామర్థ్యమున్న హైపర్‌సోనిక్‌ క్షిపణిని చైనా ఆగస్టులో పరీక్షించింది. ఈ పరీక్షతో సంబంధం ఉన్న వ్యక్తి దీనిని ప్రముఖ ఆంగ్ల వార్తపత్రిక ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ వద్ద ధ్రువీకరించారు. ఈ క్షిపణి భూమి చుట్టూ లోఎర్త్‌ ఆర్బిట్‌లో ప్రయాణించింది. కాకపోతే లక్ష్యాన్ని తప్పి 32 కిలోమీటర్లు పక్కకు వెళ్లింది.

ఈ క్షిపణిని లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ కొంత దూరం తీసుకెళ్లింది. ఆ తర్వాత దాని నుంచి విడిపోయి ఇది ప్రయాణించింది. ఆగస్టులో చైనా లాంగ్‌మార్చ్‌ రాకెట్‌ను ప్రయోగించినా.. ఈ క్షిపణి విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఈ ప్రయోగంపై స్పందించేందుకు పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కిర్బే నిరాకరించారు. కానీ, చైనా నిరంతరాయంగా సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో డ్రాగన్‌ చర్యలు ఉద్రిక్తలను పెంచుతాయని..  ఆ కారణంగానే చైనా తమకు తొలి సవాల్‌ అని పేర్కొన్నారు.

ఇప్పటికే హైపర్‌ సోనిక్‌ సామర్థ్యంలో ఆధిపత్యం సాధించేందుకు చైనా, రష్యా, అమెరికా సహా దాదాపు ఐదు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. హైపర్‌ సోనిక్‌ ఆయుధాలు బాలిస్టిక్‌ మిసైల్‌ వలే అణ్వాయుధాలను ప్రయోగించగలవు.. అంతేకాదు.. శబ్దానికి ఐదు రెట్ల వేగంతో ప్రయాణించగలవు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని