close

తాజా వార్తలు

Published : 18/01/2021 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రపంచం కష్టాల్లో ఉన్నా.. చైనా వృద్ధిబాటలో..

బీజింగ్‌: చైనాలో పుట్టి ప్రపంచదేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి ప్రతిచోటా కల్లోలం సృష్టించింది. అనేక రంగాలను ఛిన్నాభిన్నం చేసింది. అన్ని దేశాల వృద్ధిరేటుపై గట్టిదెబ్బ కొట్టింది. కరోనా కారణంగా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అయితే, ఇలాంటి సమయంలో మహమ్మారి పుట్టినిల్లయిన చైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం పుంజుకోవడం గమనార్హం. 2020లో ఆ దేశ జీడీపీ 2.3శాతం పెరిగింది. ఈ మేరకు చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌(ఎన్‌బీఎస్‌) సోమవారం డేటా విడుదల చేసింది. 

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన చైనా జీడీపీ 2020లో 2.3శాతం పెరిగి 13.42 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ఆ దేశ కరెన్సీ ప్రకారం.. ఈ విలువ 101.5986 ట్రిలియన్‌ యువాన్లు. కరోనా వైరస్‌ వెలుగుచూసిన తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ కూడా పతనమైంది. అయితే, ఈ ప్రభావం నుంచి డ్రాగన్‌ వేగంగా కోలుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా 2020 తొలి త్రైమాసికంలో ఆ దేశ జీడీపీ 6.8శాతం కుంగింది. కానీ, రెండో త్రైమాసికానికి వచ్చేసరికి మళ్లీ గాడినపడింది. అదే సమయంలో కరోనా ప్రపంచమంతా పాకి మహమ్మారిగా మారింది. 

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలవుతున్న సమయంలో చైనా స్థిరంగా కోలుకుంది. మూడో త్రైమాసికంలో జీడీపీ 4.9శాతం, నాలుగో త్రైమాసికంలో 6.5శాతం వృద్ధిచెందడం గమనార్హం. తయారీ, ఎగుమతులు కూడా పెరిగాయి. ఆ దేశ ఉద్యోగ మార్కెట్‌ కూడా మెరుగుపడింది. గతేడాది చైనాలోని పట్టణ ప్రాంతాల్లో 11.86 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. 2020లో ఆర్థిక వృద్ధి సాధించిన ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ చైనానే అని ఎన్‌బీఎస్‌ హెడ్‌ నింగ్‌ జిజే అన్నారు.

ఇవీ చదవండి..

చైనాకు ట్రంప్‌ చివరి ఝలక్‌!

భగ్గుమంటున్న పెట్రోల్‌ ధరలు



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని