close

తాజా వార్తలు

Updated : 16/04/2021 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తారాజువ్వలా చైనా ఆర్థిక వృద్ధి..!

 కొవిడ్‌ సంక్షోభాన్ని గట్టిగా తట్టుకొన్న డ్రాగన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకొంటే 18.3శాతం వృద్ధి రేటును సాధించింది. 1992లో చైనా త్రైమాసిక వృద్ధిరేటును గణించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అతిపెద్ద వృద్ధిరేటు. వాస్తవానికి రాయిటార్స్ సంస్థ నిర్వహించిన అభిప్రాయసేకరణలో ఆర్థికవేత్తలు ఇది 19శాతం వరకు ఉంటుందని భావించారు. కానీ, ఇది ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గతేడాది వృద్ధిరేటు పతనంతో  పోలిస్తే ఇది భారీ అభివృద్ధి కిందే లెక్క. వీటిని చైనా గణాంకాల విభాగం‌  విడుదల చేసింది.  చైనా వృద్ధిరేటు గణించేందుకు 2020 తొలి త్రైమాసికాన్ని బేస్‌లైన్‌గా ఎంచుకొన్నారు. అప్పటికే కొవిడ్‌ వ్యాపించడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు విధించడంతో ఆర్థిక వ్యవస్థ 6.8శాతం పతనమైంది.

ఇక గతేడాదితో పోలిస్తే పారిశ్రామిక వృద్ధిరేటు 14.1శాతం, రిటైల్‌ విక్రయాలు 34.2శాతం పెరిగాయి. ‘‘నెలవారి సూచీలు కూడా అక్కడ ఉత్పత్తి, వ్యయం,పెట్టుబడులు క్రమంగా పుంజుకొన్న విషయాన్ని వెల్లడిస్తున్నాయి’’ అని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఆర్థికవేత్త లౌసీ క్యూజస్‌ పేర్కొన్నారు. 

నిజమైన వృద్ధేనా..

ఆర్థికవేత్తలు గతంతో పోలిస్తే 19శాతం వృద్ధి సాధిస్తుందని అంచనావేశారు. కానీ, ఆ అంచనాలను అందుకోలేదు. దీంతో కొన్ని రంగాలు ఇప్పటికీ బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీలను నిలిపివేస్తే తిరిగి వృద్ధిరేటు మందగించవచ్చని భావిస్తున్నారు.



 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని