Space Station: నింగిలోకి చైనా వ్యోమగాములు!
close

తాజా వార్తలు

Published : 17/06/2021 18:33 IST

Space Station: నింగిలోకి చైనా వ్యోమగాములు!

స్పేస్‌స్టేషన్‌ నిర్మాణం కోసం 3నెలలు అంతరిక్షంలో..

బీజింగ్‌: అంతరిక్షంలో సొంత స్పేస్‌ స్టేషన్‌ నిర్మించాలని పట్టుదలతో ఉన్న చైనా, తాజాగా మరో ముందడుగు వేసింది. ఇందుకోసం ముగ్గురు వ్యోమగాములతో కూడిన లాంగ్‌మార్చ్-2F రాకెట్ గురువారం నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు చైనా జరిపిన అంతరిక్ష ప్రయోగాల్లో ఇదే అత్యంత కీలకమైనది కావడంతో, తాజా ప్రయోగం విజయవంతమవడం పట్ల డ్రాగన్‌ దేశం ఆనందం వ్యక్తం చేస్తోంది.

చైనాలోని గోబీ ఎడారి ప్రాంతంలో ఉన్న జియుక్వాన్‌ ప్రయోగ కేంద్రం నుంచి గురువారం ఉదయం లాంగ్‌మార్చ్‌-2Fను ప్రయోగించారు. దాదాపు 10నిమిషాల్లోనే నిర్ధేశించిన కక్ష్యలోకి చేరుకున్న వ్యోమనౌక, రాకెట్‌నుంచి విడిపోయింది. ఈ దశ విజయవంతం కావడంతో చైనా శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యోమనౌకలో ఉన్న ముగ్గురు వ్యోమగాములకు చెందిన వీడియోలను చైనా అధికారిక మీడియా విడుదల చేసింది. ఇక రాకెట్‌ ప్రయోగానికి ముందు ముగ్గురు వ్యోమగాములకు భారీ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. స్పేస్‌సూట్‌లతో బయలుదేరిన వారికి, ప్రయోగకేంద్రం సిబ్బందితో పాటు అక్కడికి చేరుకున్న ప్రజలు కరతాళ ధ్వనులతో వీడ్కోలు పలికారు.

అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ శక్తిగా ఎదగాలనుకుంటున్న చైనా, అంతరిక్షంలో సొంత స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించాలని తలపెట్టింది. ఇందులో భాగంగా తొలిసారి ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించింది. దాదాపు మూడు నెలలుపాటు వీరు అంతరిక్షంలోనే ఉండి.. స్పేస్‌స్టేషన్‌ నిర్మాణాన్ని చేపడుతారు. మరిన్ని ప్రయోగాల ద్వారా రెండేళ్లలో ఈ స్పేస్‌స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని