Justice NV Ramana: న్యాయవ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాలి

తాజా వార్తలు

Updated : 18/09/2021 20:20 IST

Justice NV Ramana: న్యాయవ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాలి

బెంగళూరు: దేశ న్యాయ వ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న వలస నియమాలు భారతీయుల అవసరాలకు అనుగుణంగా లేవని అభిప్రాయపడ్డారు. బెంగళూరులో సుప్రీంకోర్టు దివంగత న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతనుగౌడర్‌కు నివాళి అర్పించే కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా న్యాయవ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. సమాజంలోని ఆచరణాత్మక వాస్తవాలకు, స్థానిక అవసరాలకు అనుగుణంగా న్యాయం అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

ఈ రోజుల్లో కోర్టు తీర్పులు రావడానికి చాలా ఆలస్యం అవుతోందని, దీనివల్ల కక్షిదారులకు ఇబ్బంది కలుగుతోందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సామాన్య మానవుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించినపుడు కోర్టులు, న్యాయమూర్తులను చూసి భయపడే పరిస్థితి ఉండరాదని పేర్కొన్నారు. కక్షిదారు నిజం చెప్పగలిగేలా కోర్టు వాతావరణాన్ని సౌకర్యవంతంగా చేయాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులదేనని సూచించారు. న్యాయాన్ని ప్రజలకు చేరువచేయడం సహా దాన్ని మరింత సమర్థంగా అందించడం చాలా కీలకమని పేర్కొన్నారు. న్యాయస్థానాలు కక్షిదారు కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని