దిల్లీలో వారాంతపు కర్ఫ్యూ
close

తాజా వార్తలు

Updated : 15/04/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో వారాంతపు కర్ఫ్యూ

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ధరించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం వెల్లడించారు. కర్ఫ్యూ సమయంలో మాల్స్‌, జిమ్‌లు, ఆడిటోరియంలు, స్పా సెంటర్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. రెస్టారంట్లలో కేవలం హోండెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుందని, సినిమా థియేటర్లను 30శాతం సామర్థ్యంతో మాత్రమే నడపాలని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.

అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని కేజ్రీవాల్‌ తెలిపారు. ముందుగానే నిర్ణయించుకున్న వివాహ వేడుకులను అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆసుపత్రుల్లో ఎలాంటి పడకల కొరత లేదని చెప్పారు. తాజా గణాంకాల ప్రకారం.. ఐదు వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్న సీఎం.. మాస్క్‌లు లేకుండా కన్పించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఉదయం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయిన అనంతరం కేజ్రీవాల్‌ ఈ ప్రకటన చేశారు. ‘‘ప్రజల ఆరోగ్యం దృష్ట్యానే ఈ ఆంక్షలు విధించాల్సి వస్తోంది. వీటి వల్ల మీరు ఇబ్బంది పడతారని తెలుసు.. కానీ, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఆంక్షలు అత్యవసరం’’ అని సీఎం వీడియో ప్రసంగంలో తెలిపారు. 

గత కొన్ని రోజులుగా దిల్లీలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉంటోంది. బుధవారం అక్కడ రికార్డు స్థాయిలో 17,282 కేసులు వెలుగుచూశాయి. మహ్మమారి దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి దిల్లీలో ఈ స్థాయిలో రోజువారీ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇక నిన్న ఒక్క రోజే 100 మంది వైరస్‌కు బలయ్యారు. ప్రస్తుతం అక్కడ 50,736 క్రియాశీల కేసులున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని