పేపర్‌ బాటిళ్లలో కోకాకోలా.. వేసవి నుంచి అమ్మకాలు!

తాజా వార్తలు

Updated : 14/03/2021 14:31 IST

పేపర్‌ బాటిళ్లలో కోకాకోలా.. వేసవి నుంచి అమ్మకాలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్యావరణానికి హాని కలిగిస్తున్న వాటిలో ప్లాస్టిక్‌ ఒకటి. ప్లాస్టిక్‌ వ్యర్థాల కారణంగా నీరు, భూమి, గాలి కలుషితమవుతున్నాయి. అందుకే ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం ప్రపంచదేశాలన్నీ ఐక్యంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా యూరప్‌ సహా అనేక దేశాలు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాయి. ప్లాస్టిక్‌కు బదులు ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నాయి. ప్రభుత్వాలే కాదు.. పలు సంస్థలు సైతం ప్లాస్టిక్‌ను వీలైనంత తక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కూల్‌డ్రింక్‌ సంస్థ కోకాకోలా మరో అడుగు ముందుకేసింది. రాబోయే కాలంలో కూల్‌డ్రింక్‌ను ప్లాస్టిక్‌ బాటిళ్లలో కాకుండా పేపర్‌ బాటిళ్లలో విక్రయించనున్నట్లు ప్రకటించింది.

డెన్మార్క్‌కు చెందిన ‘ది పేపర్‌ బాటిల్‌ కంపెనీ’తో కలిసి కోకాకోలా సంస్థ పేపర్‌ బాటిళ్లను తయారు చేస్తోంది. దృఢంగా ఉండే పేపర్‌తో చేసిన బాటిల్‌పై పల్చటి ప్లాస్టిక్‌ పొరను అతికిస్తారట. ప్రస్తుతం ప్రయోగదశలోనే ఉన్న ఈ పేపర్‌ బాటిల్‌ను చూపిస్తూ ఇటీవల కోకాకోలా కంపెనీ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ పేపర్‌ బాటిల్‌ కూల్‌డ్రింక్స్‌ను ‘AdeZ’ పేరుతో ప్రయోగాత్మకంగా రానున్న వేసవి కాలంలో హంగేరీలో విక్రయించనున్నారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పేపర్‌ బాటిళ్లలోనే కూల్‌డ్రింక్స్‌ అమ్మాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కోకాకోలా తమ సంస్థ తయారు చేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, టిన్ల వ్యర్థాలను తిరిగి సేకరించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు విక్రయించిన, విక్రయిస్తున్న ప్లాస్టిక్‌ బాటిళ్లను 2030 నాటికి ఒక్కటీ వదలకుండా అన్నింటిని తిరిగి సేకరిస్తామని కోకాకోలా ఇదివరకే పేర్కొంది. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని