వేలానికి గూఢచారులు వాడిన వస్తువులు!
close

తాజా వార్తలు

Updated : 03/11/2020 10:52 IST

వేలానికి గూఢచారులు వాడిన వస్తువులు!


(ఫొటో: జూలియన్స్‌ ఆక్షన్‌ వెబ్‌సైట్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక దేశం రహస్యాలు తెలుసుకోవడానికి మరో దేశం గూఢచర్యానికి పాల్పడుతుంటుంది. 1947-1991 మధ్య అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ మధ్య కోల్డ్‌ వార్‌ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు చెందిన అధికారులు అలాగే గూఢచర్యానికి పాల్పడేవారు. ఈ క్రమంలో గూఢచారులు ఎన్నో వస్తువులు ఎవరికీ కనిపించకుండా రహస్యంగా ఉపయోగించేవారు. అలా ఆ రెండు దేశాలకు చెందిన గూఢచారులు ఉపయోగించిన రహస్య వస్తువులను న్యూయార్క్‌లోని కేజీబీ మ్యూజియంలో భద్రపర్చారు. అయితే ఇటీవల ప్రబలిన కరోనా కారణంగా మ్యూజియం నిర్వహణ కష్టతరంగా మారిందట. దీంతో అక్కడ ఉన్న గూఢచర్య వస్తువులను అమ్మేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. దీంతో జూలియన్‌ ఆక్షన్‌ సంస్థ ద్వారా వీటిని వేలానికి పెట్టారు. 

రహస్యంగా కెమెరా అమర్చిన పర్స్‌, లిప్‌స్టిక్‌ ఆకారంలో ఉన్న తుపాకీ, ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే వినడానికి ఉపయోగించే పరికరం, బల్గేరియన్‌ రచయిత జార్జి మార్కోవ్‌ హత్యకు ఉపయోగించిన సూది అమర్చిన గొడుగు, వ్లాదమిర్‌ లెనిన్‌ విగ్రహం సహా ఇరు దేశాలకు సంబంధించిన రహస్య పత్రాలు, ఆడియో రికార్డింగ్స్‌, రెండో ప్రపంచయుద్ధం సమయంలో జర్మనీ ఉపయోగించిన ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరం వంటి అనేక వస్తువుల్ని వేలంలో అమ్మబోతున్నారు. అమెరికాలోని బెవర్లీ హిల్స్‌లో ఉన్న జూలియన్‌ ఆక్షన్‌ సంస్థ కార్యాలయంలో 2021 ఫిబ్రవరి 13న ఆన్‌లైన్‌ ద్వారా వీటిని వేలం వేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని