Colombia: కొలంబియా మోస్ట్‌వాంటెడ్‌ పట్టివేత..!

తాజా వార్తలు

Published : 24/10/2021 16:01 IST

Colombia: కొలంబియా మోస్ట్‌వాంటెడ్‌ పట్టివేత..!

ఇంటర్నెట్‌డెస్క్‌: కొలంబియా మోస్ట్‌వాంటెడ్‌ మాదకద్రవ్యాల సరఫరాదారు డైరో అంటోనియో సుగా(ఒటోనియల్‌)ను అధికారులు అరెస్టు చేశారు. కొలంబియా అధ్యక్షుడు ఇవాన్‌ డ్యూక్‌  ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అతన్ని అదుపులోకి తీసుకోవడానికి సైన్యం , వాయుసేన సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించాల్సి వచ్చింది. అతనిపై ప్రభుత్వం 8లక్షల డాలర్ల  బహుమతిని ప్రకటించింది. మరోపక్క అతని ఆచూకీ చెబితే 50 లక్షల డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. 

పశ్చిమ కొలంబియాలోని ఆంటికా ప్రావిన్స్‌లో ఆంటోనియోను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌కు 500 మంది సైనికులు 22 హెలికాప్టర్లను వినియోగించారు. ఈ ఆపరేషన్‌లో ఒక భద్రతాధికారి మరణించారు. 

ఆటోనియో భద్రతా దళాలను తప్పించుకోవడానికి మారుమూల గ్రామాల్లో పలు ఇళ్లను ఏర్పాటు చేసుకొన్నాడు. అతను ఫోన్‌ కూడా వినియోగించడు. కేవలం కొరియర్ల కమ్యూనికేషన్‌ మీదే ఆధారపడతాడు. అతను ఉన్న ప్రదేశంపై రెండు వారాలుగా దళాలు నిఘా వేసి ఆపరేషన్‌ నిర్వహించాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని