వారికి టీకా ధరను కంపెనీలే నిర్ణయిస్తాయి: నీతి ఆయోగ్‌

తాజా వార్తలు

Published : 09/06/2021 01:33 IST

వారికి టీకా ధరను కంపెనీలే నిర్ణయిస్తాయి: నీతి ఆయోగ్‌

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ నెల 21 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు ఇస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. ఉత్పత్తి అయ్యే టీకాల్లో 25 శాతం ప్రైవేటు రంగానికి కేటాయించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్‌ వేసినందుకు రూ.150 మాత్రమే ఛార్జీ చేయాలని మోదీ కోరారు. కాగా.. ప్రైవేటు ఆస్పత్రులకు టీకాల ధరల అంశంపై నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ స్పందిస్తూ..ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరను వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలే నిర్ణయిస్తాయని వెల్లడించారు. అయితే, ప్రైవేటు ఆస్పత్రుల టీకాల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వాలే పరిశీలిస్తాయని తెలిపారు. ఆస్పత్రుల నెట్‌వర్క్‌, సదుపాయాలు, అవసరమయ్యే డోసులను రాష్ట్రాలే చూసుకుంటాయని చెప్పారు. 

మరోవైపు సార్వత్రిక టీకా కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 44 కోట్లకు పైగా టీకా డోసులు ఆర్డర్‌ చేసింది. కొవిషీల్డ్‌ పంపిణీ చేస్తున్న పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు కొత్తగా మరో 25కోట్ల డోసులకు ఆర్డర్‌ ఇవ్వగా.. కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు 19కోట్ల డోసులకు ఆర్డర్‌ ఇచ్చింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని