రామాలయ నిర్మాణంతో ‘రామ రాజ్యం’

తాజా వార్తలు

Updated : 05/08/2020 12:17 IST

రామాలయ నిర్మాణంతో ‘రామ రాజ్యం’

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌

అయోధ్య: అయోధ్యలో రామమందిర ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న ఈరోజు చరిత్రాత్మకమైన రోజని యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. రామమందిరం నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్‌దేవ్‌ బాబా మంగళవారం మధ్యాహ్నం అయోధ్యకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆయన అయోధ్యలోని ప్రముఖ దేవాలయం హనుమాన్‌ గఢీ ఆలయాన్ని సందర్శిచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాబా రామ్‌దేవ్‌ మాట్లాడుతూ...

‘‘భారత చరిత్రలో ఇది చరిత్రాత్మక రోజు. ఈరోజు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది. ఆ రోజును మనం సంబరంగా జరుపుకోవాలి. మందిర నిర్మాణంతో దేశంలో రామ రాజ్యానికి పునాది పడుతుందని విశ్వసిస్తున్నాను’’ అని  అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని