కరోనాపై త్వరలోనే విజయం: హర్షవర్దన్‌

తాజా వార్తలు

Published : 15/08/2020 01:18 IST

కరోనాపై త్వరలోనే విజయం: హర్షవర్దన్‌

దిల్లీ: భారత్‌లో కరోనా రికవరీ రేటు రోజురోజుకీ మెరుగుపడుతోందని కేంద్రమంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై కొనసాగుతున్న పోరాటంలో త్వరలోనే విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. గతంలో రికవరీ రేటు 9% అని ఓ మీడియా సమావేశంలో చెప్పడం గుర్తుందన్న ఆయన.. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కోలుకున్నవారి శాతంరోజురోజుకీ పెరుగుతూనే వస్తోందన్నారు. అలాగే, మరణాల రేటు కూడా రోజురోజుకీ తగ్గుతోందని తెలిపారు. 

రికవరీ రేటు 71.72%

దేశంలో నిన్న ఒక్కరోజే 55,573మంది కోలుకొని డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 17,51,555 మంది కొవిడ్‌ కొరల్లోంచి బయటపడగా.. రికవరీ రేటు 71.17%గా ఉంది. అలాగే నిన్న ఒక్కరోజే 1007 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 48,040గా నమోదైంది. ప్రస్తుతం మరణాల రేటు 1.95% గా ఉంది. 

రికార్డు స్థాయిలో టెస్టింగులు

మరోవైపు, కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. మొత్తం 1451 ల్యాబోరేటరీల్లో నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 8,48,728 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం టెస్టింగుల సంఖ్య 2,76,94,416గా ఉంది.

దేశంలో 26వేలకు పైగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా..

భారత్‌లో కరోనా వాచ్‌

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని