close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/05/2020 00:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా: భారత్‌లో 18వేలకు పైగా మరణాలు!

బెంగళూరు: కొవిడ్ -19 కేసుల సంఖ్య జులై ప్రారంభంలో తారస్థాయికి చేరుకుంటుందని, మరణాల సంఖ్య 18వేలకు పైగా ఉండొచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని సెంటర్ ఫర్ కంట్రోల్ ఆఫ్ క్రానిక్ కండీషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రభాకరన్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వెల్లడైన అధ్యయనాలు, వివిధ దేశాల్లో కరోనా చూపిన ప్రభావం ఆధారంగా రాబోయే రోజుల్లో దేశం ఎదుర్కోనున్న పరిస్థితుల గురించి ఆయన వివరించారు. 

నాలుగు నుంచి ఆరు లక్షల మందికి వైరస్‌..

సుమారు 4 నుంచి 6 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని ప్రభాకరన్‌ వెల్లడించారు. మరణాల రేటు మూడు శాతంగా ఉండొచ్చని, ఆ లెక్కన చూసుకుంటే 12 వేల నుంచి 18 వేల మందికి పైగా మరణించే అవకాశం ఉందని అంచనా వేశారు. మహమ్మారి ముగింపు దశకు చేరుకున్నాకే మరణాల సంఖ్య తక్కువ, ఎక్కువ అనే విషయాన్ని చెప్పగలమన్నారు. ఇప్పటివరకు లభించిన సమాచారం మేరకు మరణాల సంఖ్య తక్కువగానే ఉందని చెప్పారు. ఇటలీ, యూఎస్‌లతో పోల్చుకుంటే భారత్‌లో వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటమే కారణమని తెలిపారు. అయితే వయసు ఓ కారణం కాగా, బీసీజీ టీకాలు, తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడటంతో వాటి నివారణకు వాడే వ్యాక్సీన్లు భారతీయుల్లో రోగనిరోధక శక్తి పెరుగుదలకు దోహదం చేశాయని అన్నారు. వాటితో పాటు దేశంలో ప్రస్తుతం నెలకొన్న అధిక ఉష్ణోగ్రతలు కూడా వైరస్‌ వ్యాప్తిపై ప్రభావం చూపించొచ్చని చెప్పారు. అయితే వాటికి కచ్చితమైన ఆధారాలు మాత్రం లేవని తెలిపారు.  

ముందుగానే లాక్‌డౌన్..

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(హైదరాబాద్) డైరెక్టర్ జీవీ మూర్తి మాట్లాడుతూ..దక్షిణాసియా ప్రాంతంలో అత్యల్ప మరణాల రేటులో శ్రీలంక ముందు ఉందని, సింగపూర్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మలేషియాలో కూడా మరణాల సంఖ్య తక్కువగానే ఉందన్నారు. మహమ్మారిని కట్టడి చేయడానికి యూఎస్, ఐరోపా దేశాల కంటే ఈ దేశాలు ముందుగానే లాక్‌డౌన్‌ను అమలు చేయడం దీనికి కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత్‌లో 60 ఏళ్లకు పైబడిన వారిలోనే మరణాల సంఖ్య అధికంగా ఉందని వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా మధుమేహం, బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కరోనా సోకకుండా తప్పించుకున్నారని, దానివల్లే మరణాల సంఖ్య తగ్గిపోయిందని వివరించారు. మరో రెండు వారాల్లో డెంగీ, మలేరియా, డయేరియా వంటి రోగాలు ప్రభావం చూపనున్నాయని, అయితే ఇలాంటి వ్యాధులను అరికట్టడంలో పరిశుభ్రతదే కీలక పాత్రని.. కొవిడ్‌-19 నుంచి మనందరం నేర్చుకున్న పాఠమని గుర్తుచేశారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.