
తాజా వార్తలు
జమ్ముకశ్మీర్‌లో తొలి కరోనా మరణం
జమ్ముకశ్మీర్: జమ్ము కశ్మీర్లో తొలి కరోనా మరణం నమోదైంది. 65ఏళ్ల వృద్ధుడు శ్రీనగర్‌లోని ఛాతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కేంద్ర హోం శాఖ ధ్రువీకరించింది. కరోనా బాధితుడు డయాబెటిస్, బీపీ, ఊబకాయంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 కేసులు జమ్మూ నుంచి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు