Covaxin: ఆ రెండు రకాలపైనా పనిచేస్తుంది!
close

తాజా వార్తలు

Published : 16/05/2021 18:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covaxin: ఆ రెండు రకాలపైనా పనిచేస్తుంది!

వెల్లడించిన భారత్‌ బయోటెక్‌

దిల్లీ: కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు స్వదేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా కొత్త రకాలపై పనిచేస్తోందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లో వెలుగుచూసినట్లు భావిస్తోన్న బి.1.617తో పాటు బ్రిటన్‌లో రకం బి.1.1.7 వైరస్‌ను కొవాగ్జిన్‌ టీకా తటస్థీకరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన పత్రాన్ని భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా ట్విటర్‌లో పంచుకున్నారు.

వ్యాక్సిన్‌ వేరియంట్‌ (D614G)తో పోలిస్తే బి.1.617 రకాన్ని తటస్థీకరించడంతో కొవాగ్జిన్‌ చెప్పుకోదగిన రీతిలో తగ్గిస్తున్నప్పటికీ.. అంచనా వేసిన దానికంటే ఎక్కువ రక్షణ కల్పిస్తుందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఇక వ్యాక్సిన్‌ వేరియంట్‌, బ్రిటన్‌ రకం(బి.1.1.7)వైరస్‌లను తటస్థీకరించడంలో కొవాగ్జిన్‌ ఒకే విధంగా పనిచేస్తుందని తెలిపింది. ఐసీఎంఆర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో జరిపిన అధ్యయనంలో ఈ ఫలితాలు కనిపించాయని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. కొవాగ్జిన్‌ టీకాను భారత్‌లో ఇప్పటివరకు 18రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆసంస్థ వెల్లడించింది.

భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాగా ఇప్పటివరకు 18కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించారు. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ భారత్‌లోనే తయారవుతుండగా తాజాగా అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ జులై నుంచి భారత్‌లో ఉత్పత్తి కానుంది. ఇక కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా రకాలపై ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు పనిచేస్తున్నాయనే నివేదికలు ఊరట కలిగించే విషయం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని