Bharat Biotech: భారత్‌ బయోటెక్‌కు మరో గౌరవం

తాజా వార్తలు

Published : 05/08/2021 13:42 IST

Bharat Biotech: భారత్‌ బయోటెక్‌కు మరో గౌరవం

హంగరీ ప్రభుత్వం నుంచి కొవాగ్జిన్‌కు జీఎంపీ ధ్రువపత్రం 

హైదరాబాద్: కొవాగ్జిన్ టీకా తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌కు మరో గౌరవం దక్కింది. కొవాగ్జిన్‌ తయారీకి మెరుగైన తయారీ పద్ధతులు (జీఎంపీ) కంపెనీ అనుసరిస్తోందని పేర్కొంటూ ఐరోపా దేశం హంగరీ ధ్రువపత్రాన్ని జారీ చేసింది. గురువారం ఈ విషయాన్ని భారత్‌ బయోటెక్‌ ట్విటర్ వేదికగా వెల్లడించింది. 

‘‘భారత్‌ బయోటెక్ మరో మైలురాయిని చేరుకుంది. హంగరీ నుంచి కొవాగ్జిన్‌ జీఎంపీ ధ్రువపత్రాన్ని పొందింది. ఐరోపా నియంత్రణ సంస్థల నుంచి బయోటెక్ అందుకున్న మొదటి సమ్మతి పత్రమిది’’ అని భారత్‌ బయోటెక్ సంస్థ ట్వీట్ చేసింది. ప్రపంచస్థాయి నాణ్యతతో టీకా తయారు చేస్తున్న తమ సంస్థకు ఇది శుభవార్తని భారత్‌ బయోటెక్‌ ఆనందం వ్యక్తం చేసింది. కరోనాపై జరుపుతున్న పోరాటంలో మరింత ముందుకు వెళ్లేందుకు ఇది దోహదపడుతుందని వెల్లడించింది. హంగరీ దేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, న్యూట్రిషన్‌ నుంచి దీన్ని పొందినట్లు పేర్కొంది. అది ఔషధ ఉత్పత్తులకు లైసెన్సులు ఇచ్చే అధికారిక సంస్థ.  తాజా ధ్రువపత్రం EudraGMDP డేటాబేస్‌లో లిస్టయి ఉంటుంది. ఐరోపా కమ్యూనిటికీ సంబంధించి తయారీ అనుమతులు, జీఎంపీ ధ్రువపత్రాలు పొందిన సంస్థల జాబితా ఆ డేటాబేస్‌లో పొందుపరిచి ఉంటుంది.

మరోవైపు తమ టీకాకు ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని దేశాల్లో అత్యవసర వినియోగ అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత్‌ బయోటెక్ వెల్లడించింది. అందుకు తగిన పత్రాలను సమర్పించనున్నట్లు పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని