రెండో డోసువారికే కొవాగ్జిన్‌

తాజా వార్తలు

Published : 07/06/2021 01:10 IST

రెండో డోసువారికే కొవాగ్జిన్‌

వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం నిర్ణయం

దిల్లీ: వ్యాక్సిన్ల కొరత సమస్య వేధిస్తున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో డోసు తీసుకోవాల్సిన 18-44 ఏళ్ల మధ్య వయసు వారికి మాత్రమే కొవాగ్జిన్‌ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు అన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్‌ నెల మొత్తం లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. ప్రయివేటు ఆసుపత్రులు సైతం తాజా నిబంధనలకు లోబడి టీకాలు ఇవ్వాలని పేర్కొన్నారు. 

18-44 ఏళ్ల మధ్య వయసు వారికి మే 1 నుంచి దిల్లీ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రారంభించింది. 45 ఏళ్ల వయసు పైబడిన వారికి 303 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెల రోజుల తర్వాత కొవాగ్జిన్‌ కొరత కారణంగా నిలిచిపోయింది. ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. 45 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేందుకు ఒక రోజుకు సరిపడా డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొవిషీల్డ్ డోసులు మాత్రం మరో 28 రోజుల వరకు సరిపడా నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 368 ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 18-45 ఏళ్ల మధ్య వయసు వారికి కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ టీకాలు వేయడం రెండు వారాల వరకు పూర్తిగా నిలిపివేశారు. 

ప్రభుత్వ గణాంకాల ప్రకారం దిల్లీలో ఆదివారం ఒక్కకోజే 57,990 వ్యాక్సిన్లు వేశారు. వాటిలో 42,742 తొలి డోసు కాగా.. 15,248 రెండో డోసు టీకాలు. ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం 56,51,226 డోసులు ఇచ్చింది. ఇందులో 12,84,000 మందికి రెండు డోసులు వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని