Karnataka: తెరుచుకోనున్న విద్యాసంస్థలు

తాజా వార్తలు

Published : 18/07/2021 21:11 IST

Karnataka: తెరుచుకోనున్న విద్యాసంస్థలు

బెంగళూరు: కరోనా కేసులు తగ్గుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను మరింత సడలించింది. జులై 19 నుంచి 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు పునఃప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు జులై 26 నుంచి తెరుచుకోవచ్చని తెలిపింది. కనీసం ఒక డోసు టీకా తీసుకున్నవారిని మాత్రమే తరగతులు, విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీర్ఘకాలిక సాంకేతిక కోర్సులతో పాటు అన్ని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు తెరుచుకోవచ్చని పేర్కొంది. పాఠశాలలు తెరుచుకునేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

రాత్రిపూట కర్ఫ్యూను ఒక గంట తగ్గించిన ప్రభుత్వం.. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. దిల్లీలో పార్టీ పెద్దలను కలిసివచ్చిన అనంతరం.. బెంగళూరులో రాష్ట్ర సీనియర్‌ అధికారులతో చర్చలు జరిపిన సీఎం బీఎస్‌ యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 27న కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించగా కేసులు తగ్గడంతో ఆంక్షలను సడలిస్తోంది. మే 5న గరిష్ఠంగా ఒక్కరోజులో 50 వేలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి రాగా ప్రస్తుతం రెండు వేలలోపే కేసులు నమోదవుతున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని