Gujarat: సంతానభాగ్యం కల్పించండని కోరిన భార్య.. మరుసటి రోజే విషాదం

తాజా వార్తలు

Updated : 23/07/2021 19:04 IST

Gujarat: సంతానభాగ్యం కల్పించండని కోరిన భార్య.. మరుసటి రోజే విషాదం

వడోదరా: కరోనా బాధిత భర్త వీర్యం కోసం గుజరాత్​ హైకోర్టును ఆశ్రయించిన మహిళ ఇంట విషాదం నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో వీర్యం సేకరించిన మరుసటి రోజే.. ఆమె భర్త(32) కన్నుమూశాడు. సదరు మహిళ తరఫు న్యాయవాది నిలయ్​ పటేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. కోర్టు అనుమతులిచ్చిన కొద్దిసేపటి తర్వాత మహిళ భర్త నుంచి వీర్యాన్ని సేకరించామని ఆస్పత్రి వర్గాలు తమకు సమాచారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు.

వడోదరాలోని ఓ ఆస్పత్రిలో కొవిడ్​తో చికిత్స పొందుతున్న తన భర్త నుంచి సేకరించిన వీర్యం ద్వారా ఐవీఎఫ్​ విధానంలో తల్లి కావాలని ఆశించింది ఓ మహిళ. అయితే.. ఆస్పత్రి వైద్యులు అందుకు నిరాకరించారు. కోర్టు అనుమతులిస్తేనే తాము వీర్యాన్ని సేకరిస్తామని తెలిపాయి. దీంతో గుజరాత్ హైకోర్టులో ఆ మహిళ పిటిషన్​ దాఖలు చేసింది. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం.. సదరు కొవిడ్​ బాధితుడి నుంచి వీర్యాన్ని తక్షణమే సేకరించాలని ఆస్పత్రిని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దాన్ని తగినవిధంగా భద్రపరచాలని సూచించింది. కాగా కోర్టు ఆదేశించిన రోజే ఆ వ్యక్తి వీర్యాన్ని సేకరించినట్లు స్టెర్లింగ్​ ఆస్పత్రి జోనల్ డైరెక్టర్​ అనిల్​ నంబియార్​ తెలిపారు. కోర్టు అనుమతిస్తే ఐవీఎఫ్ విధానం కోసం దాన్ని వినియోగిస్తామని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని