Karnataka: మళ్లీ కొవిడ్‌ విజృంభణ.. కర్ణాటకలో ఆంక్షలు

తాజా వార్తలు

Published : 30/07/2021 20:13 IST

Karnataka: మళ్లీ కొవిడ్‌ విజృంభణ.. కర్ణాటకలో ఆంక్షలు

బెంగళూరు: కొద్దివారాలుగా తగ్గుముఖం పడుతూ వచ్చిన కొవిడ్ మహమ్మారి.. మరోమారు విజృంభిస్తోంది. వైరస్​ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఉన్న ఆంక్షలను కఠినతరం చేయడం సహా కొత్త నిబంధనలను విధిస్తున్నాయి. కర్ణాటకకు వచ్చేవారికి నెగిటివ్​ ఆర్​టీపీసీఆర్​ రిపోర్టు తప్పనిసరి చేసింది ఆ రాష్ట్ర సర్కారు.

అకస్మాత్తుగా కరోనా కేసులు పెరగడం.. సరిహద్దు రాష్ట్రాలు కేరళ, మహారాష్ట్రలో వైరస్‌ విజృంభణతో కర్ణాటకలో లాక్​డౌన్​ భయాలు పెరిగాయి. సరిహద్దు జిల్లాలు దక్షిణ కన్నడ, చామరాజనగర్, చిక్కమగళూరు, హసన్​లో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర కొత్త సీఎం బసరాజ్​ బొమ్మై స్పందించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు సరిహద్దుల్లో ఆంక్షలు కఠినతరం చేసి.. టెస్టులు, వ్యాక్సినేషన్​ను తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలకు దిగింది కర్ణాటక ప్రభుత్వం. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి ఆర్​టీపీసీఆర్​ నెగిటివ్​ రిపోర్టు తప్పనిసరి చేసింది. గతంలో కరోనా టీకా తీసుకున్నవారికి అందుకు మినహాయింపు ఉన్నా.. ప్రస్తుతం వారు కూడా నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. పర్యవేక్షణ కఠినతరం చేయాలని జిల్లా యంత్రంగాలను ప్రభుత్వం ఆదేశించింది . పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైతే అదనపు ఆంక్షలను విధించుకోవచ్చని వెల్లడించింది. పండగల కోసం చేసే ప్రయాణాలపైనా రాష్ట్రంలో ఆంక్షలు విధించే అవకాశం ఉంది. కర్ణాటకలో గురువారం 2,052 కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోలిస్తే దాదాపు 500 కేసులు అధికంగా నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని