close

తాజా వార్తలు

Published : 14/01/2021 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌లో 96శాతం రికవరీ రేటు..

గడచిన 24 గంటల్లో 16,946 పాజిటివ్‌ కేసులు

దిల్లీ: గడచిన 24 గంటల్లో భారత్‌లో 16,946 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 1,05,12,000కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 24 గంటల్లో 198 మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,51,727కు చేరింది. ఇప్పటి వరకూ వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,01,46,763కు చేరింది. ఫలితంగా కొవిడ్‌ రికవరీ రేటు 96.52గా ఉండగా, మరణాల రేటు 1.44 శాతంగా ఉంది. ప్రస్తుతానికి దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,13,603గా ఉంది. ఇండియన్‌ మెడికల్ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం జనవరి 14 వరకూ 18 కోట్ల 42లక్షల 32వేల శాంపిల్స్‌ను పరీక్షించారు.
దేశవ్యాప్తంగా జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు వ్యాక్సిన్‌లను తరలించారు.

ఇవీ చదవండి..

తొలిరోజు.. 3లక్షల మందికి టీకా

నష్టాల్లో మార్కెట్‌ సూచీలు


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన