భారత్‌లో 8 లక్షలు దాటిన కరోనా కేసులు
close

తాజా వార్తలు

Published : 10/07/2020 21:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

రికవరీ రేటు 63% పైనే ఉండడం శుభ పరిణామం

ముంబయి: భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో 7,484 కేసులు జత కలవడంతో ఈ మార్క్‌ అందుకుంది. కేవలం మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య ఏడు నుంచి ఎనిమిది లక్షలకు చేరుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 8,01,286గా ఉంది. దేశవ్యాప్తంగా వారం రోజుల నుంచి కేసుల సంఖ్య ప్రతి రోజూ 20వేలు దాటుతుండటం గమనార్హం. ఈ లెక్కన పది లక్షలను దాటేందుకు మరీ ఎక్కువ రోజులు పట్టే అవకాశం లేదు.

మహారాష్ట్ర 2,30,599 కేసులతో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 1,30,261తో తమిళనాడు, 1,07,051తో దిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కేసుల సంఖ్య పెరగడంతో మహారాష్ట్రలో చికిత్స చేయడం కష్టమవుతోంది. రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమాబ్‌ వంటి ఔషధాలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో సరఫరా పెంచుతామని ఆ రాష్ట్రం తెలిపింది. దేశవ్యాప్తంగా 90% క్రియాశీల కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, కర్ణాటక, తెలంగాణ నుంచే ఉండటం గమనార్హం. 49 జిల్లాల నుంచే 80% కేసులు ఉన్నాయి. అయితే మొత్తంగా రికవరీ రేటు 63% ఉండటం శుభపరిణామం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని