close

తాజా వార్తలు

Updated : 07/04/2021 18:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇకపై పని ప్రదేశాల్లోనే టీకా: కేంద్రం 

దిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11వ తేదీ నుంచి పని ప్రదేశాల్లోనే వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపింది. 45ఏళ్లు పైబడిన వారందరికీ పని ప్రదేశాల్లోనే టీకా వేసేందుకు అనుమతించింది. కనీసం 100 మంది టీకా వేయించుకొనేందుకు సిద్ధంగా ఉంటే అక్కడే వ్యాక్సినేషన్‌ చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను ఆదేశించినట్టు పేర్కొంది. 

దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కొవిడ్‌కు కళ్లెం వేసే లక్ష్యంతో ఇప్పటికే టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్రం.. ఈ నెలలో అన్ని రోజులూ టీకా పంపిణీ కొనసాగేలా ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ టీకా పంపిణీ ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తోంది. అర్హులైన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. తాజాగా, ఈ నెల 11న పని ప్రదేశాల్లోనే టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్రం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్