కొవిడ్‌ మృతుల్లో 88%మంది ఈ వయసు వారే

తాజా వార్తలు

Updated : 24/03/2021 19:10 IST

కొవిడ్‌ మృతుల్లో 88%మంది ఈ వయసు వారే

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా పరిస్థితిని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మీడియాకు వివరించారు. భారత్‌లో ఇప్పటివరకు సంభవించిన కొవిడ్‌ మరణాల్లో 88% 45ఏళ్లు పైబడినవారేనని వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవువుతుందని స్పష్టంచేశారు. దేశ వ్యాప్తంగా బుధవారం ఉదయం 10గటల వరకు 5,08,41,286 డోసుల టీకా పంపిణీ జరిగినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 20 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 92శాతం మేర టీకా తొలి డోస్‌ పంపిణీ జరిగిందన్నారు.

దేశంలో యాక్టివ్‌ కేసులు మరోసారి 3లక్షలు దాటాయని అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.  మహారాష్ట్ర, పంజాబ్‌లలో అధికంగా నమోదవుతున్న కొత్త కేసులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. అత్యధిక క్రియాశీల కేసులు కేవలం పది జిల్లాల్లోనే ఉన్నాయని తెలిపారు. వీటిలో మహారాష్ట్రలో తొమ్మిది, కర్ణాటకలో ఒక జిల్లా ఉన్నట్టు వెల్లడించారు.ఈ జాబితాలో పుణె, నాగ్‌పూర్‌, ముంబయి, ఠానే, నాసిక్‌, ఔరంగాబాద్‌, బెంగళూరు అర్బన్ (కర్ణాటక)‌, నాందేడ్‌‌, జల్‌గావ్‌, అకోలా ఉన్నాయి.
మరోవైపు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లోనూ కొత్త కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గుజరాత్‌లో ముఖ్యంగా సూరత్‌లో, అహ్మదాబాద్‌, వడోదర, రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌లలో కొత్త కేసులు వస్తుండగా.. మధ్యప్రదేశ్‌లో భోపాల్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, ఉజ్జయిన్‌, బేతుల్‌లో వస్తున్నట్టు గుర్తించామన్న్నారు.  అయితే దేశంలో మరోసారి భారీగా పెరుగుతున్న కేసులకు విదేశాల్లో గుర్తించబడిన కొత్త వేరియంట్లతో సంబంధం ఉన్నట్టు ఇంకా నిర్ధారణ కాలేదన్నారు.

దేశంలో నిన్న ఒక్కరోజే 47,262 కొత్త కేసులు రాగా.. 275 మంది మృతిచెందారు. 23,907మంది కోలుకున్నారు. తాజా గణాంకాలతో భారత్‌లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,17,34,058కి పెరిగింది. వీరిలో 1,12,05,160 (95.49శాతం) మంది కోలుకోగా.. 1,60,441 (1.37శాతం) మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 3,68,457 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని